Wednesday, October 28, 2026
Homeతెలంగాణప్రకృతి ఆరాధనకు ప్రతీక బతుకమ్మ పండుగ...

ప్రకృతి ఆరాధనకు ప్రతీక బతుకమ్మ పండుగ : కలెక్టర్ దీపక్ తివారి

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, వికారాబాద్ : ప్రకృతిలో లభించే పూలను దేవతగా పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహర, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు, పూల వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే బతుకమ్మ సంబరాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ వేడుకలు సాంస్కృతిక ఐక్యతను, సామాజిక సౌభ్రాతృత్వాన్ని చాటిచెప్పాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ అధికారి కాంతారావు, డీపీవో జయసుధ, డీపీఆర్వో చెన్నమ్మ, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళా ఉద్యోగులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!