Wednesday, October 28, 2026
Homeక్రైమ్ న్యూస్జవహర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు...

జవహర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

📰 Generate e-Paper Clip

🔸అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొని స్వామి దుర్మరణం

ఆర్ జె న్యూస్, జవహర్‌నగర్ : జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్వామి (32) అనే యువకుడు మృతి చెందాడు. అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. అంబేద్కర్ నగర్‌కు చెందిన స్వామి యాక్టివా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, TS 08 Z 0171 నంబర్ గల ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. మృతుడు స్వామికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!