ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ప్రకృతి ఆరాధనకు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు.జిల్లా రెవెన్యూ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పౌరసరఫరాల శాఖ, భూగర్భ జల శాఖ, కీసర రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళా అధికారులు, సిబ్బంది బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు.కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మాలతి, సుస్మిత, లాఫెసర్ చంద్రావతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆనంద్‌తో పాటు పలువురు మహిళా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
RELATED ARTICLES
