Friday, October 30, 2026
Homeమేడ్చల్ జిల్లారోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయ చర్యలు..!...

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయ చర్యలు..! ప్రమాదాల నివారణే లక్ష్యం

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. శనివారం మేడ్చల్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల గుర్తింపు, రోడ్డు సూచికల ఏర్పాటు, వేగ నియంత్రణ, పాదచారుల భద్రత, రోడ్డు మార్కింగ్‌లు, వీధి దీపాల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును పరిశీలించారు.రోడ్డు భద్రతకు సంబంధించిన సమస్యలపై ఆయా శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదాలకు ఆస్కారమున్న ప్రాంతాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రోడ్లు, భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ పి. జలందర్, పోలీసు, రవాణా, పంచాయతీరాజ్, మున్సిపల్, జాతీయ రహదారుల శాఖల అధికారులు, రోడ్డు భద్రతా కమిటీ గౌరవేతర సభ్యుడు జైపాల్‌రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!