🔸ఐదుగురు అరెస్ట్.. రూ.35 వేల నగదు, ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. తిమ్మాయపల్లి రెవెన్యూ పరిధిలో పేకాట ఆడుతున్నారన్న పక్క సమాచారంతో కీసర సీఐ ఎలక్షన్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్‌ఐ నాగరాజు, పోలీసు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.35 వేల నగదు, ఐదు ద్విచక్ర వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
