వరంగల్‌కు వెళ్లి తిరిగొచ్చేసరికి చోరీ.. తులం బంగారం, రూ.25 వేల నగదు కూడా మాయం
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో దొంగతనం కలకలం రేపింది. పండుగ సందర్భంగా వరంగల్‌లోని అత్తగారింటికి వెళ్లిన కుటుంబం తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించింది.కీసరలోని ఆర్‌ఎల్ నగర్, ప్లాట్ నంబర్ 17లో నివాసముంటున్న రఘురామ్ ఇంట్లోకి చొరబడిన దొంగలు సుమారు నాలుగు కిలోల వెండి, తులం బంగారం, రూ.25 వేల నగదును అపహరించినట్లు బాధితుడు తెలిపాడు.ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు
