Wednesday, October 28, 2026
Homeమేడ్చల్ జిల్లాపట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి...

పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

📰 Generate e-Paper Clip

🔸కాంగ్రెస్ శ్రేణులకు మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి పిలుపు

ఆర్ జె న్యూస్, శామీర్ పేట : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి అన్నారు. ప్రతి వార్డులో అర్హులైన పట్టభద్రులను గుర్తించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేయించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్ ఆధ్వర్యంలో అన్య కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో పార్టీ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, ఇన్‌ఛార్జులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తూ ఇంటింటికీ వెళ్లి నమోదు ప్రక్రియను ప్రోత్సహించాలని అన్నారు.అదేవిధంగా నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ‘ఓటు బచావో–దేశ్ బచావో’ మహాసభను విజయవంతం చేయడానికి అలియాబాద్ మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్, కౌన్సిలర్ ముద్దం సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సరసం అశోక్ రెడ్డి, నాయకులు కోడూరి దినేష్, బండరి బాబు, తంటం రాము, ఊరడి వెంకటేష్, చాట్లపల్లి నర్సింగరావు, ముద్దం వీరారెడ్డి, ధర్మారెడ్డి, సంఘమైన కుమార్ యాదవ్, మణికొండ నవీన్, కుడుముల వెంకటేష్, దొండ మనోహర్, వీరన్నగారి భూపాల్, చిటుకుల రాజశేఖర్ రెడ్డి, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!