Wednesday, October 28, 2026
Homeమేడ్చల్ జిల్లాపిల్లల భద్రతకు పోక్సో చట్టంపై అవగాహనే...

పిల్లల భద్రతకు పోక్సో చట్టంపై అవగాహనే రక్షణ

📰 Generate e-Paper Clip

🔸మంచి స్పర్శ.. చెడు స్పర్శపై ప్రతి విద్యార్థికి అవగాహన కల్పించాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాలభాస్కర్‌

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : పిల్లలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు పోక్సో చట్టంపై ప్రతి విద్యార్థికి అవగాహన కల్పించాలని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాలభాస్కర్‌ సూచించారు. బాలల భద్రతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. మంగళవారం బోడుప్పల్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో పోక్సో చట్టం–2012పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చట్టంలోని ముఖ్య నిబంధనలు, బాలలపై లైంగిక నేరాలకు సంబంధించిన అంశాలను అధికారులు వివరించారు. మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడాను గుర్తించడం, అపరిచితులు లేదా తెలిసిన వ్యక్తుల నుంచి ఎదురయ్యే అనుచిత ప్రవర్తన పట్ల అప్రమత్తంగా ఉండటం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే భయంతో మౌనంగా ఉండకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. 18 ఏళ్లలోపు పిల్లలపై జరిగే లైంగిక నేరాల విషయంలో పోక్సో చట్టం కింద చర్యలు తీసుకుంటారని వివరించారు.

వేధింపులపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలి

మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్‌ కీలకంగా పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. వేధింపులకు గురైనప్పుడు ఫిర్యాదు చేసే విధానం, బాధితులకు అందుబాటులో ఉన్న రక్షణ, చట్టపరమైన హక్కుల గురించి వివరించారు. బాలలపై లైంగిక నేరాల నివారణకు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, సమాజం సమష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారి ప్రియాంక, మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ డి. జలేందర్‌ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!