🔸క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించిన ఎంఎంసీ కమిషనర్
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మేడ్చల్–మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం కీసర సర్కిల్ పరిధిలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. నాలాల అభివృద్ధి, జంక్షన్ల ఆధునికీకరణ, స్వచ్ఛ బడి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని, నిర్ణీత ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రామలింగం, ఎస్‌డబ్ల్యూఎం డీఈ సంతోష్, మెయింటెనెన్స్ డీఈ మాధవచారి, పద్మలత, ఏఈ అనిల్, టౌన్ ప్లానింగ్ అధికారులు, చైన్‌మెన్లు తదితరులు పాల్గొన్నారు.
