Tuesday, October 27, 2026
Homeమేడ్చల్ జిల్లాశ్రీ చైతన్య కొంపల్లి బ్రాంచ్ విద్యార్థి...

శ్రీ చైతన్య కొంపల్లి బ్రాంచ్ విద్యార్థి లోకేష్ గౌడ్ ప్రతిభ – IPS రాజేష్ చంద్ర ప్రశంసలు

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, కొంపల్లి : శ్రీ చైతన్య స్కూల్, కొంపల్లి-1 CBSE బ్రాంచ్ విద్యార్థి లోకేష్ గౌడ్ తన సృజనాత్మక ఆలోచనతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. దసరా సెలవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అంశంపై రూపొందించిన ప్రాజెక్టును కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర (IPS)కి అంకితమిస్తూ సమర్పించాడు. విద్యార్థి రూపొందించిన ప్రాజెక్టును పరిశీలించిన ఎస్పీ రాజేష్ చంద్ర, లోకేష్ గౌడ్ ఆలోచనా నైపుణ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సమకాలీన సాంకేతిక అంశాలపై చిన్న వయసులోనే ఆసక్తి చూపడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రాజెక్టులు విద్యార్థులలో పరిశోధనా దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందిస్తాయని పేర్కొంది. విద్యార్థిని పాఠశాల AGM చౌదరి రవి, ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి, కోఆర్డినేటర్ రవి, డీన్ వంశీ రెడ్డి, లీడ్ ఇన్ ఛార్జ్ ప్రమోద్ కుమార్ తదితరులు అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!