Tuesday, October 27, 2026
Homeమేడ్చల్ జిల్లాపదవీకాలం ముగిసినా.. చైర్మన్‌ కుర్చీ దిగరా!

పదవీకాలం ముగిసినా.. చైర్మన్‌ కుర్చీ దిగరా!

📰 Generate e-Paper Clip

 🔸గడువు ముగిసింది.. అయినా కొనుగోలు కేంద్రం ప్రారంభం!

🔸మంత్రుల వద్ద పొడిగింపు ఫైల్‌ ఉందంటున్న బొమ్మలపల్లి నర్సింలు యాదవ్

🔸ప్రభుత్వ ఉత్తర్వులు రాకముందే హోదా కొనసాగింపుపై చర్చ!

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : పదవీకాలం ముగిసినా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హోదా కొనసాగుతోందా? గడువు దాటిన తర్వాత కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వెనుక ఉన్న కారణమేంటి? ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్‌పూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్‌ నర్సింలు ప్రారంభించడంతో ఈ ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా నర్సింలు రెండేళ్ల పదవీకాలం ఈ నెల 8వ తేదీతో ముగిసినట్లు సమాచారం. అయినప్పటికీ, సోమవారం డబిల్‌పూర్‌లో కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఆయన ఏ హోదాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

మంత్రుల వద్ద పొడిగింపు ఫైల్‌ ఉందట!

పదవీకాలం ముగిసిన విషయమై బొమ్మలపల్లి నర్సింలును ప్రశ్నించగా, పొడిగింపునకు సంబంధించిన ఫైల్‌ మంత్రుల వద్ద ఉందని, పదవీకాలం పొడిగిస్తారని చెప్పినట్లు సమాచారం. అయితే, ఫైల్‌ మంత్రుల వద్ద ఉండటం వేరు.. పొడిగింపునకు అధికారిక ఉత్తర్వులు జారీ కావడం వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసంపై స్పష్టత అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉత్తర్వులు వచ్చాయా? లేదా?

పదవీకాలం పొడిగింపునకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపిందా? ఉత్తర్వులు జారీ అయ్యాయా? లేక ఇంకా ఫైల్‌ పరిశీలనలోనే ఉందా? అన్న ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. ఉత్తర్వులు జారీ అయితే వాటి వివరాలు వెల్లడించాలి. లేకుంటే పదవీకాలం ముగిసిన తర్వాత చైర్మన్‌ హోదాలో కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉన్న అధికారిక ఆధారాలను స్పష్టం చేయాలి.ఫైల్‌ పేరుతో హోదా కొనసాగుతుందా? లేక ప్రభుత్వ ఉత్తర్వులే ప్రామాణికమా? ఈ వ్యవహారంపై మార్కెట్‌ కమిటీ అధికారులు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.పదవీకాలం ముగిసిన అంశంపై అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుంది? నర్సింలు హోదా కొనసాగింపుపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది? అన్నది వేచి చూడాలి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!