ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : తాగునీటి కోసం కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలియాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో మరో 60 రోజుల్లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామని, ప్రజలకు క్రమం తప్పకుండా తాగునీరు అందించటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.గతంలో మేడ్చల్ నియోజకవర్గానికి పదేళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హయాంలో ప్రజల సమస్యలకు తగిన ప్రాధాన్యం లభించలేదని ఆమె విమర్శించారు. ముఖ్యంగా తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. పాలన ఎలా సాగిందో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ గత పాలకులు వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపలేదని ఆరోపించారు. తాగునీటి సమస్య ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయని వారు.. ఇప్పుడు సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం మిషన్ భగీరథ పనులపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేస్తోందన్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చైర్పర్సన్ తెలిపారు.
మూడు మున్సిపాలిటీలకు తీరనున్న తాగునీటి కష్టాలు..! 60 రోజుల్లో నీరు అందిస్తామంటే సంతోషంగా ఉంది: చైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి
RELATED ARTICLES
