Thursday, August 20, 2026
Homeమేడ్చల్ జిల్లాఉప్పలమ్మ ఆలయ నిర్మాణానికి శ్రీకారం..! చైర్‌పర్సన్...

ఉప్పలమ్మ ఆలయ నిర్మాణానికి శ్రీకారం..! చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి పూజలు

ఆర్.జె.న్యూస్,అలియాబాద్ : అలియాబాద్ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో కొలువుదీరిన ఉప్పలమ్మ అమ్మవారి దేవాలయ నిర్మాణానికి మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం చైర్‌పర్సన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పలమ్మ అమ్మవారి దేవాలయం భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆలయం పూర్తయిన తర్వాత ఈ ప్రాంత భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.

🔸భక్తుల సహకారం కోరిన చైర్‌పర్సన్

ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తయ్యేందుకు ప్రజాప్రతినిధులు, స్థానికులు, భక్తులు అందరూ సహకరించాలని చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి కోరారు. మున్సిపల్ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డి, పట్టణ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!