ఆర్.జె.న్యూస్, శామీర్‌పేట్ : హకీంపేట్ ఆర్టీసీ డిపోలో సీనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్)గా కర్తవ్యనిష్ఠతో పనిచేసి, తోటి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సహకరించిన ఎస్ శ్రీనివాస్ సేవలు అభినందనీయమని డిపో సూపరిండెంట్ మురారి రామ్మోహన్‌రావు అన్నారు. సంస్థకు విశిష్ట సేవలందించిన అమరనాథ్, ఏడీసీ, నాగరాజు, డ్రైవర్‌లను కూడా అభినందించారు. సోమవారం పదవీ విరమణ సందర్భంగా శ్రీనివాస్‌తో పాటు పదవి విరమణ పొందుతున్న అమరనాథ్, ఏడీసీ, నాగరాజు, డ్రైవర్ లను డిపో సిబ్బంది, యూనియన్ నాయకులు, సహోద్యోగులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మురారి రామ్మోహన్‌రావు మాట్లాడుతూ.. క్రమశిక్షణ, నిజాయితీ, కర్తవ్యనిష్ఠతో పనిచేసిన ఉద్యోగులు సహచరుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఎస్ శ్రీనివాస్ ఫైనాన్స్ విభాగంలో బాధ్యతాయుతంగా పనిచేసి, కార్యాలయ కార్యకలాపాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. పదవీ విరమణ కొత్త జీవితానికి నాంది అని పేర్కొంటూ, ఉద్యోగులు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ అనుభవాలను పంచుకుని, సహకరించిన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిపో అధికారులు భూపాల్, ఆచార్యులు, సిబ్బంది మౌనిక, సంధ్య, కృప, యూనియన్ నాయకులు పవన్‌కుమార్, శ్రీశైలం, తులసీరామ్, శ్రీనివాస్, రాజేందర్, రమేష్, కన్నారెడ్డి, సుగుణాచారి, యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
కర్తవ్యనిష్ఠతో సేవలందించిన శ్రీనివాస్‌కు ఘన సన్మానం
RELATED ARTICLES
