ఆర్.జె.న్యూస్. డెస్క్. మల్కాజిగిరి : ఆపదలో ఉన్న కార్యకర్తకు అండగా నిలిచారు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. పార్టీ కార్యక్రమం ముగించుకుని నిజామాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో పార్టీ నేత సాగర్‌కు గుండెపోటు వచ్చిందని తెలుసుకుని వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశారు. మిలటరీ డెయిరీ ఫామ్ వద్ద పార్టీ నేతల ద్వారా విషయం తెలుసుకున్న మైనంపల్లి, తన కారును నేరుగా రష్ ఆస్పత్రికి మళ్లించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందేలా చూశారు. పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు నిర్ధారించే వరకు అక్కడే ఉండి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆస్పత్రి ఖర్చు మొత్తం తానే భరిస్తానని ప్రకటించి, అనంతరం తన ప్రయాణాన్ని కొనసాగించారు. కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా చూసుకునే నాయకుడు మైనంపల్లి అంటూ స్థానికులు ప్రశంసిస్తున్నారు.
