Saturday, September 5, 2026
Homeమేడ్చల్ జిల్లాశామీర్‌పేట్ ఎంఆర్పీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక

శామీర్‌పేట్ ఎంఆర్పీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : శామీర్‌పేట్ మండల ఎంఆర్పీఎస్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. దండోరా జాతీయ కళా మండలి నాయకుడు ఎన్వై అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన అధ్యక్షుడిగా వెంకటేశ్, అధికార ప్రతినిధిగా కిషన్, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్‌ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా నితిన్, మధు, రాకేశ్, కోశాధికారిగా విజయ్‌ను నియమించారు.సభ్యులుగా శ్రీకాంత్, మహేశ్, ప్రసాద్, నరేశ్, వినయ్, సాయికుమార్, శ్రీను, బాలనరసింహ, భాస్కర్‌లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అశోక్ మాదిగ, చంద్రశేఖర్ మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమ నిర్మాణాన్ని యువత భాగస్వామ్యంతో మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమబాటలో పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!