Wednesday, September 9, 2026
HomeతెలంగాణGHMCఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

📰 Generate e-Paper Clip

మేడ్చల్ (ఆర్ జె న్యూస్) జూలై 7 :
మేడ్చల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో 1971–1972 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ విద్యాభ్యాస కాలంలో పొందిన అనుభవాలను పంచుకుంటూ, గురువుల మార్గదర్శకత తమ జీవితాల్లో ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మల్లారెడ్డి ని ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయుటకు సహకరించిన వేముల సీతారాం రెడ్డి,గల్వ పాపారావు ,కొమరవెల్లి బద్రి నారాయణ లకు తమ స్నేహితులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!