Sunday, October 4, 2026
Homeమేడ్చల్ జిల్లామేడ్చల్ KLR శ్రీ గార్డెన్ లో...

మేడ్చల్ KLR శ్రీ గార్డెన్ లో లైఫ్ సేవర్ ఆధ్వర్యంలో శిబిరం – ప్రారంభించిన CI అంజిరెడ్డి

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : గాంధీ జయంతిని పురస్కరించుకుని మేడ్చల్‌ పట్టణంలోని కేఎల్‌ఆర్‌ వెంచర్‌ శ్రీ గార్డెన్‌లో లైఫ్‌ సేవర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆరాధ్య బ్లడ్‌ బ్యాంకు సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి యువత, స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్‌ సీఐ అంజిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకరు చేసే రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడుతుందని, రక్తదానాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ చూపిన సేవా మార్గంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన యువతను, నిర్వాహకులను అభినందించారు.అనంతరం రక్తదాతలకు నిర్వాహకులు, సీఐ అంజిరెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. శిబిరం విజయవంతానికి నిర్వాహకులు రంజిత్‌, శ్రీకర్‌, రవితేజ, రాఘవేంద్ర, రహమత్‌, అలీ, రఘు, సాయిరాం, ప్రేమ్‌ తదితరులు కృషి చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, స్వచ్ఛంద సేవకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!