Tuesday, November 24, 2026
Homeమేడ్చల్ జిల్లాభక్తిశ్రద్ధలతో చత్ పూజ మహోత్సవం

భక్తిశ్రద్ధలతో చత్ పూజ మహోత్సవం

📰 Generate e-Paper Clip

అత్వెల్లి చెరువు వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ మండలం అత్వెల్లి చెరువు వద్ద జన సేవ సంఘ్ చత్ పూజ సమితి ఆధ్వర్యంలో చత్ పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సూర్య భగవానుడికి, ఛటీ మైయాకు కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహించే చత్ పూజకు ప్రాచీనమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందన్నారు. భూమిపై జీవకోటికి శక్తిని ప్రసాదించే సూర్యుడిని, జల వనరులను ఆరాధించడం ఈ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు. కులమత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలంతా ఒకచోట చేరి చెరువులు, నదుల వద్ద ఉదయం, సాయంత్రం సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం భారతీయ సంస్కృతిలోని ఐక్యతకు నిదర్శనమన్నారు. ఇటువంటి పండుగలు సామాజిక సమైక్యతను, సంప్రదాయాలను కాపాడుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, నాయకులు అమరం మోహన్ రెడ్డి, జన సేవ సంఘ్ చత్ పూజ సమితి అధ్యక్షుడు బిస్వజీత్ సింగ్, ఉపాధ్యక్షుడు ఎస్.ఏ. ఖాన్, కార్యదర్శి సురేష్ పండిట్, కోశాధికారి సుశీల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!