ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 57వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. విద్యార్థుల మధ్య ఆప్యాయంగా సాగిన ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈసారి విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్స్, పెన్నులు అందజేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖను కూడా తన వద్దే ఉంచుకుని ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో సన్నబియ్యంతో భోజనం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విద్యార్థులు సీఎం రేవంత్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని తుంగతుర్తి రవి ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరిన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శంకర్, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేశ్, చెరకు మహేష్ గౌడ్, ముదిగొండ రమేష్, పవన్ గౌడ్, చింతల నర్సింహ రెడ్డి, రాజ రాజు, మణిరాం నాయక్, నాగరాజు, మజర్, బోల్గురి నాగరాజు, అమర్నాథ్, చిరంజీవి రెడ్డి, మహేశ్వరప్ప, రామబ్రహ్మం, శరత్, కపిల్, చిందం రాజు, తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో సీఎం జన్మదిన వేడుకలు
RELATED ARTICLES
