ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మహాత్మాగాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2వ వార్డు కౌన్సిలర్ బుక్య శారద రాజు నాయక్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు. గాంధీజీ ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఆయన చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రజలు ఆచరించాలని సూచించారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని కోరారు.కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ గూడూరు విజయలక్ష్మి, 7వ వార్డు కౌన్సిలర్ బందేల కుమార్, మున్సిపల్ సెక్రెటరీ అపర్ణ, సీనియర్ నాయకులు హరిబాబు రెడ్డి, కుమ్మరి జహంగీర్, నాగరాజుచారి, చుక్క సత్యనారాయణ, మామిళ్ల మహేందర్ యాదవ్, బందెల స్వామి, మున్వర్ అలీ, హర్షత్ అలీ, చుక్క శంకర్, జీడిపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీజీ ఆశయాలను ఆచరించాలి – ఎల్లంపేటలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
RELATED ARTICLES
