Thursday, November 26, 2026
Homeమేడ్చల్ జిల్లారాఘవేంద్ర నగర్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ...

రాఘవేంద్ర నగర్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ఇళ్ల నుంచి వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను తీసుకొచ్చి ఒకచోట చేర్చి, సామూహికంగా బతుకమ్మ ఆడారు.బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. చిత్తు చిత్తుల గుమ్మ.. శివుని ముద్దుల గుమ్మ..తదితర బతుకమ్మ పాటలకు లయబద్ధంగా అడుగులు వేస్తూ మహిళలు, యువతులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ ఆడటంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.పూల పండుగ బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టాయి. మహిళలు, చిన్నారుల సందడితో రాఘవేంద్ర నగర్ కాలనీ కళకళలాడింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!