రెడ్డి ఎన్‌క్లేవ్ రోడ్ నంబర్ 11లో పర్యటించిన మాజీ కార్పొరేటర్
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : రెడ్డి ఎన్‌క్లేవ్ రోడ్ నంబర్ 11లో నెలకొన్న మురుగునీటి సమస్యను పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం ఆమె హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ డీజీఎం వెంకటేశ్వర్లుతో కలిసి కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. మురుగునీటి సమస్యలతో ఎదురవుతున్న ఇబ్బందులను నివాసితులు వారి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిశీలించిన ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన పనులు చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ పర్యటనలో శేఖర్, దివాకర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ప్రేమ్, సాజిద్, వీఎన్ రాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
