Tuesday, November 24, 2026
Homeమేడ్చల్ జిల్లాయాసంగిలో వరి సాగు తగ్గించాలి

యాసంగిలో వరి సాగు తగ్గించాలి

📰 Generate e-Paper Clip

🔸ప్రత్యామ్నాయ పంటలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యమివ్వాలి: మేడ్చల్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు వెంకట్రామ్ రెడ్డి

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : రానున్న యాసంగి 2026 సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొనే అవకాశాలున్న నేపథ్యంలో రైతులు ముందస్తు పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని మేడ్చల్‌ డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్‌.వెంకట్రామ్ రెడ్డి సూచించారు. నీటి లభ్యత పరిమితంగా ఉండే అవకాశం ఉన్నందున వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని ఆయన కోరారు.ముఖ్యంగా బోరుబావులు, పరిమిత నీటి వనరులపై ఆధారపడే రైతులు వరికి బదులుగా పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, ఆముదం వంటి తక్కువ నీటి అవసరమయ్యే పంటలను సాగు చేయాలని సూచించారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మేడ్చల్‌ జిల్లాలో మార్కెట్‌ అవకాశాలను వినియోగించుకుంటూ కూరగాయల సాగుకు ప్రాధాన్యమివ్వాలని ఆయన తెలిపారు.భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించుకోవాలని, స్వల్పకాలిక పంట రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగానే వరి సాగు చేపట్టాలని, వ్యవసాయశాఖ అధికారుల సలహాల మేరకు పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు.
పంటల వైవిధ్యీకరణతో పాటు నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవచ్చని వెంకట్రామ్ రెడ్డి పేర్కొన్నారు. రైతులందరూ యాసంగి సీజన్‌లో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించి నీటి పొదుపులో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!