Tuesday, November 3, 2026
Homeమేడ్చల్ జిల్లామూడు గంటల్లోనే ఇద్దరు బాలుర ఆచూకీ...

మూడు గంటల్లోనే ఇద్దరు బాలుర ఆచూకీ గుర్తింపు

📰 Generate e-Paper Clip

🔸వరంగల్ రైల్వే స్టేషన్‌లో గుర్తించిన ఘట్కేసర్ పోలీసులు.

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలురను ఘట్కేసర్ పోలీసులు కేవలం మూడు గంటల్లోనే గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 31న రాత్రి 8.40 గంటల సమయంలో కొండాపూర్ గ్రామానికి చెందిన ఓర్సు వసంత, ములుగురం లలిత తమ కుమారులు ఓర్సు శివప్రసాద్ (12), ములుగురం యశ్వంత్ (13) కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే ఇన్‌స్పెక్టర్ పి. కిరణ్ ఆధ్వర్యంలో ఎస్ఐలు ఎ. శేఖర్, ఎ. రాఘవేంద్ర ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కానిస్టేబుళ్లు సత్యనారాయణ, రాజు సమన్వయంతో చేపట్టిన చర్యలతో కేవలం మూడు గంటల్లోనే వరంగల్ రైల్వే స్టేషన్‌లో బాలురను గుర్తించారు.పాఠశాలకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారని, దీంతో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయామని బాలురు పోలీసులకు తెలిపారు. అనంతరం వారిని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.ఈ సందర్భంగా పోలీసులు తల్లిదండ్రులకు సూచనలు చేశారు. పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యలను ఓపికగా వినాలని, ప్రేమతో మార్గనిర్దేశం చేయాలని కోరారు. పిల్లలు కనిపించకుండా పోయినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!