Sunday, September 20, 2026
Homeమేడ్చల్ జిల్లాగౌడవల్లి, కండ్లకోయలో ఘనంగా వినాయక పూజలు

గౌడవల్లి, కండ్లకోయలో ఘనంగా వినాయక పూజలు

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్,గుండ్లపోచంపల్లి : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని గౌడవల్లి, కండ్లకోయ గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయా యూత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్ ముదిరాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని అందజేశారు. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్న యూత్ సభ్యులను సురేందర్ ముదిరాజ్ అభినందించారు. యువత ఐక్యతతో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ అసోసియేషన్ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!