ఆర్ జె న్యూస్,వెబ్ డెస్క్ : అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి చెందింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన దారం సుప్రియ (31) అమెరికాలోని మిస్సోరిలో ఉద్యోగ రీత్యా నివాసం ఉంటోంది. ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుప్రియ అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న భారత్‌కు చెందిన మరో యువతికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మరిపెడకు చెందిన సుప్రియ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.
