Sunday, August 16, 2026
HomeతెలంగాణGHMCఎస్‌ఐఆర్ ఓటరు సర్వే పరిశీలనలో మేడ్చల్–మల్కాజిగిరి...

ఎస్‌ఐఆర్ ఓటరు సర్వే పరిశీలనలో మేడ్చల్–మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి

ఆర్ జె న్యూస్, మేడ్చల్ :

మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సర్వే కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ నేతలు పరిశీలించారు. మేడ్చల్ సర్కిల్‌తో పాటు శామీర్‌పేట్ మండలంలోని అలియాబాద్, ఎం.సి.పల్లి, తూముకుంట గ్రామాలు, సంబంధిత మున్సిపాలిటీల పరిధిలోని పలు కాలనీలు, వార్డుల్లో బీఎల్‌ఓలతో కలిసి మేడ్చల్–మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, తొలగింపులు తదితర అంశాలపై బీఎల్‌ఓలతో సమీక్ష నిర్వహించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో మూడు చింతల పల్లి మున్సిపల్ చైర్మన్ జాము రవి,శామీర్పేట్ మాజీ జడ్పీటీసీ అనిత , మాజీ ఎంపీపీ ఏళ్ళుభైయి బాబు ,బిఆర్ఎస్ నాయకులు వెంకట్ రెడ్డి,మోహన్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!