Saturday, October 3, 2026
Homeరాజకీయంకాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుల నియామకం

కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుల నియామకం

📰 Generate e-Paper Clip

మేడ్చల్ ఆర్ జె న్యూస్ జూలై 3 : సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపాలిటీ కార్పొరేషన్ల పరిధిలో ఉన్న వివిధ డివిజన్ల అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ నియామకం చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రష్ యాదవ్ ఉత్తర్వులను జారీ చేశారు. మేడ్చల్ డివిజన్ అధ్యక్షుడిగా నడి కొప్పు నాగరాజు (చాప రాజు) పూడూర్- కిష్టాపూర్ అధ్యక్షుడిగా రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, గుండ్ల పోచంపల్లి డివిజన్ అధ్యక్షుడిగా సురేందర్ ముదిరాజ్. షామీర్పేట అధ్యక్షుడిగా నక్క సందీప్ గౌడ్, జవహర్ నగర్ అధ్యక్షురాలిగా శాంతి గౌడ్, చంద్రపురి కాలనీ అధ్యక్షుడిగా శ్రీకాంత్ గౌడ్, దమ్మైగూడ అధ్యక్షుడిగా ముప్ప రామారావు, కీసర అధ్యక్షురాలి గా రామిడి స్వప్న రెడ్డి, నాగారం అధ్యక్షుడిగా ఇళ్లసాని భూమయ్య యాదవ్, ఘట్కేసర్ అధ్యక్షుడిగా బొక్క ప్రభాకర్ రెడ్డి, ఎదులాబాద్ అధ్యక్షుడిగా సామల అమర్, పోచారం అధ్యక్షుడిగా కర్రే రాజేష్, మేడిపల్లి అధ్యక్షుడిగా రవి తుంగతుర్తి, పీర్జాదిగూడ అధ్యక్షుడిగా బండి శ్రీరాములు గౌడ్, బోడుప్పల్ అధ్యక్షుడిగా బొమ్మ కళ్యాణ్, చెంగిచెర్ల అధ్యక్షుడిగా పోగుల దిలీప్ రెడ్డి నియామకం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!