మేడ్చల్ (ఆర్ జె న్యూస్) జూలై 6 :
సైబరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ కిష్టాపూర్ పూడూర్ డివిజన్ కిష్టాపూర్ అర్చన కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చండి ఉపాసకులు బ్రహ్మశ్రీ సంజయ్ శర్మ వైదిక బృందంతో ఆదివారం ఉదయాత్ పూర్వము బ్రాహ్మి ముహూర్తం 3:30గంటల నుండి కర్మణః పుణ్యాహా వాచనం, గర్తన్యాసం, బీజన్యాసం, ధాతున్యాసం, 4:50 గంటలకు యంత్రస్ధాపన నల్లపోచమ్మ పరివార, విగ్రహాల ప్రతిష్ట ప్రాణప్రతిష్ట దృక్ బలి, దిక్ బలి, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన సంప్రోక్షణ, శాంతి కళ్యాణం మహానైవేద్యం హారతి మంత్రపుష్పం ఆశీర్వచనం పండిత సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు. మధ్యాహ్నం 12 నుండి అన్న ప్రసాద సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మాజీ డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్, మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోమారం బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ డివిజన్ అధ్యక్షులు నడికొప్పు నాగరాజు, చెరువుకొమ్ము శేఖర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ దేవ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి, దయానంద్ యాదవ్, తుడుం గణేష్, మోహన్ రెడ్డి, నర్సింగ్ రావు, భారతీయ జనతా పార్టీ మేడ్చల్ అధ్యక్షురాలు జల్లి శైలజా హరినాథ్, బి జే పి మేడ్చల్ మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ దోసడి రామచంద్రా రెడ్డి, బి జె పి నాయకులు అర్జున్, గామిడి మధుసూదన్ రెడ్డి, మహిళలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
