ఆర్ జె న్యూస్, మేడ్చల్ :
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అలియాబాద్ చౌరస్తాలో నిర్వహించిన ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు శాలువాతో సన్మానం చేశారు. ఇటీవల గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడిగా నియమించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
