ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురికి మేడ్చల్ కోర్టు జైలు శిక్ష విధించింది. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను బుధవారం మేడ్చల్లోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, 7వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.విచారణ అనంతరం 14 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పరిష్కరించిన న్యాయస్థానం.. ఐదుగురికి జైలు శిక్ష విధించింది. ఒకరికి ఐదు రోజుల, మరొకరికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించగా.. ఇద్దరికి మూడు రోజుల చొప్పున, మరో వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించింది.మద్యం సేవించి వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్.. ఐదుగురికి జైలు..! 14 కేసుల పరిష్కారం..
RELATED ARTICLES
