Thursday, September 10, 2026
Homeమేడ్చల్ జిల్లాదళిత కాలనీలోకి వస్తే చెప్పులతో కొడతాం...

దళిత కాలనీలోకి వస్తే చెప్పులతో కొడతాం – పానుగంటి మహేష్

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : బీఆర్ఎస్ నేతల తీరుపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ నేతలు తాత మధు, నవీన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ నిన్న దళితులు డప్పు చప్పుళ్లతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి ముట్టడికి వెళ్లారు. అయితే దళితులు వచ్చి వెళ్లిన ప్రదేశాన్ని కేసీఆర్ ఫామ్ హౌస్ మైలపడిందంటూ పసుపు నీళ్లతో కడగడం దారుణమని A బ్లాక్ SC సెల్ మాజీ అధ్యక్షులు పానుగంటి మహేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై ఇంకా వివక్ష, దౌర్జన్యం కొనసాగుతోందని, ఇది దొరల రాజ్యాన్ని తలపిస్తోందని మండిపడ్డారు. ఇక నుంచి మా దళిత కాలనీలోకి ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు వచ్చినా చెప్పులతో కొట్టి తరిమికొడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శిస్తూ దళితులపై వివక్ష చూపుతున్నారని, యావత్ దళిత సంఘాలు స్పందించి బీఆర్ఎస్ పార్టీ అహంకారానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!