⚫ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్.. శుభాకాంక్షల వెల్లువ
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) 50వ జన్మదిన వేడుకలు బోయినపల్లిలో కోలాహలంగా జరిగాయి. బోయినపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి ముఖ్యాతిథిగా హాజరై కేక్ కట్ చేసి, కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి ప్రగతి రథసారథిగా కేటీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రజల ఆశీస్సులతో ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, నూరేళ్ల ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర పురోగతిలో, ప్రత్యేకించి ఐటీ, పారిశ్రామిక రంగాల పురోభివృద్ధిలో కేటీఆర్ చూపిన చొరవ అభినందనీయమని, నేటి యువతకు ఆయన దిశానిర్దేశకుడిగా నిలిచారని పేర్కేన్నారు. ఈ వేడుకల్లో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు నవీన్ రెడ్డి, సందీప్ రెడ్డిలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
