Sunday, August 16, 2026
HomeతెలంగాణGHMCవిద్యతోనే భవిష్యత్‌కు బలమైన పునాది: ఎమ్మెల్యే...

విద్యతోనే భవిష్యత్‌కు బలమైన పునాది: ఎమ్మెల్యే మల్లారెడ్డి..!

మేడ్చల్ (ఆర్ జె న్యూస్) జూలై 11 :

యువత నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మేడ్చల్ ఎమ్మెల్యే సి.హెచ్. మల్లారెడ్డి అన్నారు. శనివారం సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఎంఆర్‌సీఈటీ)లో జరిగిన 21వ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆయన పాల్గొని పట్టభద్రులను అభినందించారు. జేఎన్‌టీయూహెచ్ అకడమిక్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ కామాక్షి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో సీఎంఆర్ గ్రూప్ కార్యదర్శి, కరస్పాండెంట్ సి.హెచ్. గోపాల్ రెడ్డి, చైర్‌పర్సన్ కల్పన రెడ్డి, సీఈఓ అభినవ్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్రీనివాస్ రావు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!