ఆర్జె.న్యూస్,మేడ్చల్ : గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలో కండ్లకోయ సీఎంఆర్‌ఐటీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల కోసం 22వ ఓరియంటేషన్ డేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎంఆర్‌ఐటీలో చదివిన పలువురు విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. కొత్తగా చేరిన విద్యార్థులు నాలుగేళ్ల అనంతరం మంచి ప్లేస్‌మెంట్లు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకపాత్ర పోషించనుందని, విద్యార్థులు ఏఐపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.సీఎంఆర్ గ్రూప్ సెక్రటరీ డా. గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. నెలకోసారి కళాశాలకు వచ్చి హాజరు, అకడమిక్ పర్ఫార్మెన్స్‌ను తెలుసుకోవాలని కోరారు. సీఈవో అభినవ్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వినూత్న ఆలోచనలతో స్టార్టప్‌ల వైపు అడుగులు వేయాలని సూచించారు.
ఇన్వెస్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హెచ్‌ఆర్ హెడ్ ప్రతిష్య శర్మ, ప్రతుష్ మేత్ మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. సీఎంఆర్‌ఐటీ డైరెక్టర్ డా. జంగారెడ్డి మాట్లాడుతూ కష్టపడితే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదన్నారు. తల్లిదండ్రులు పిల్లలను సుఖాలకు అలవాటు చేయకుండా కష్టపడి పనిచేసేలా తీర్చిదిద్దాలని సూచించారు.ఫ్రెష్‌మెన్ ఇంజినీరింగ్ హెచ్‌ఓడీ డా. రాధాకృష్ణరెడ్డి విద్యార్థులు పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, డీన్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
