అర్ జె న్యూస్, శామీర్ పేట : 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం అనంతరం అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహ, అరవింద్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల కారణంగా ఎంతోమంది రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అర్హత ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. భూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు.కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంటరీ అధ్యక్షుడు కందికంటి అశోక్‌గౌడ్, మేడ్చల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి సుంకర వెంకటేష్, పార్లమెంట్ అడహాక్ కమిటీ సభ్యులు కరణం గోపి, చంద్రశేఖర్, రామకృష్ణ, తెలుగు యువత జనరల్ సెక్రటరీ నరేష్ ముదిరాజ్, జవహర్‌నగర్ అధ్యక్షుడు నామాల సురేష్, దమ్మాయిగూడ అధ్యక్షుడు కృష్ణారావు, నాగారం అధ్యక్షుడు కొండ జంగారెడ్డి, కాప్రా సీనియర్ నాయకుడు రాముల యాదవ్, తెలుగు మహిళా నాయకురాలు ఆశాబిందు, ఉమాశంకర్ గౌడ్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

