Thursday, September 10, 2026
Homeతెలంగాణహైదరాబాద్ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు -...

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు – తప్పిన పెను ప్రమాదం

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, ఎల్బీనగర్ : ఎల్బీనగర్ చింతలకుంట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న విజయవాడ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కియా కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వారికి ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం తర్వాత డోర్లు లాక్ కావడంతో కారులో ఉన్న వ్యక్తులు కొంతసేపు ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. కారులో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నట్లు సమాచారం. ఓ రాజకీయ నాయకుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ మద్యం సేవించి ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!