Thursday, September 17, 2026
Homeమేడ్చల్ జిల్లారైతుల జీవన విధానంపై సీఎంఆర్‌ విద్యార్థుల...

రైతుల జీవన విధానంపై సీఎంఆర్‌ విద్యార్థుల అధ్యయనం

📰 Generate e-Paper Clip

అత్తెల్లిలో రైతులతో ముచ్చటించిన విద్యార్థులు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : సీఎంఆర్‌ కళాశాల విద్యార్థులు మేడ్చల్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని 298వ డివిజన్‌ అత్తెల్లి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు, స్థానికులతో మాట్లాడి వారి జీవన విధానం, వ్యవసాయ పరిస్థితులు, భవిష్యత్‌ అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు.రైతులతో ముచ్చటించిన విద్యార్థులు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు, పంటల సాగు, రైతుల భవిష్యత్‌ పరిస్థితులపై సమాచారం సేకరించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా స్థానికులతో మాట్లాడటం ద్వారా పలు విషయాలను తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు.విద్యార్థులకు అవసరమైన భోజనం, తాగునీరు తదితర ఏర్పాట్లను 298వ డివిజన్‌ అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. విద్యార్థుల పర్యటనకు సహకరించిన మల్లేష్‌గౌడ్‌కు కళాశాల విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!