🔸ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్‌రెడ్డి విమర్శ
ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో కాలుష్య సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర చెత్తను మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాకు తరలిస్తూ ప్రజల ఆరోగ్యం, రైతుల జీవనోపాధిపై ప్రభావం పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు, చెర్లపల్లి పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడుతున్న కాలుష్యంపై ప్రజల్లో ఆందోళన ఉందన్నారు. దమ్మాయిగూడ, నాగారం, కీసర, ఘట్కేసర్, ఎదులాబాద్ ప్రాంతాల్లో నీరు, గాలి, మట్టి కాలుష్యంపై శాస్త్రీయ పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.కాలుష్య నియంత్రణ మండలి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నీరు, గాలి, మట్టి, పంటలు, పాలు, చేపల నమూనాలను సేకరించి పరీక్షించాలని సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ చలపతి ప్రవీణ్‌రావు, ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షుడు కమిటీ బైపాస్‌రెడ్డి, సీనియర్ నాయకులు రాజేష్, శ్రీశైలం, మల్లేష్ ముదిరాజ్, సుధాకర్, వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

