ఆర్ జె న్యూస్, మేడ్చల్ : తెలంగాణ చరిత్రలో జరిగిన పోరాటాలు, అమరవీరుల త్యాగాలను నేటి తరానికి తెలియచెప్పాల్సిన అవసరం ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మేడ్చల్లోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ చరిత్రలో మరువలేని రోజు అని, నిజాం రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్యానికి పునాది పడిన రోజు అని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటం, అమరుల బలిదానాల ఫలితంగానే నేడు మనం ప్రజాస్వామ్య ఫలాలను అనుభవిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్లేపూల నరసయ్య, జిల్లా గ్రంథాలయ పాలకురాలు నాగవేణి, సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.
అమరుల త్యాగాలను నేటి తరానికి తెలియచెప్పాలి – జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి
RELATED ARTICLES
