🔸చెట్ల పొదల్లో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం
ఆర్ జె న్యూస్, మేడ్చల్: మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలోని అత్వెల్లి రేకుల బావి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. బావి సమీపంలోని చెట్ల పొదల్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.మృతుడి ఆచూకీ, గుర్తింపునకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహం అక్కడికి ఎలా వచ్చింది? ఎంతకాలంగా అక్కడ ఉంది? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
