Saturday, October 3, 2026
Homeమేడ్చల్ జిల్లాజవహర్ నగర్ సీఐ ని కలిసిన...

జవహర్ నగర్ సీఐ ని కలిసిన స్థానిక జర్నలిస్టులు

📰 Generate e-Paper Clip

🔸శాంతిభద్రతలు, నకిలీ జర్నలిస్టుల కదలికలపై చర్చ

ఆర్ జె న్యూస్, జవహర్ నగర్ : మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐ సైదులును స్థానిక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా రాత్రివేళల్లో పెట్రోలింగ్ పెంచాలని, గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని సీఐ దృష్టికి తీసుకెళ్లారు. బయట ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ విలేకరులుగా చలామణి అవుతున్న కొందరు నకిలీ జర్నలిస్టుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానిక జర్నలిస్టులు వివరించారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఐ సైదులు స్పందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి, నేరాల అదుపునకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. నకిలీ జర్నలిస్టులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు, మీడియా సమన్వయంతో పనిచేస్తే సమాజంలో మంచి మార్పు వస్తుందని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!