Saturday, October 3, 2026
Homeమేడ్చల్ జిల్లావినాయక నిమర్జనంలో పాల్గొన్న చామకూర మహేందర్...

వినాయక నిమర్జనంలో పాల్గొన్న చామకూర మహేందర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

 🔸రూ. 2లక్షల 10 వేలు పలికిన లడ్డూ..

 ఆర్ జె న్యూస్, మేడ్చల్ : పూడూర్- కిష్టాపూర్ డివిజన్ పరిధిలో పలు వినాయక నిమర్జన ఊరేగింపు కార్యక్రమల్లో బీఆర్ఎస్  నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ చామకూర మహేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయాల మాజీ చైర్మెన్ భాస్కర్ యాదవ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు నవీన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాబుయాదవ్, నాయకులు శేఖర్ రెడ్డి, వెంకటేష్ , కృష్ణ, శశికుమార్ , శ్రీకాంత్, సుశాంత్ తదితరులు పూడూరులోని పలు యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిమర్జన ఊరేగింపు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 రూ. 2లక్షల 10 వేలు పలికిన లడ్డూ..

పూడూర్ మహదేవ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి ఊరేగింపు సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో రూ. 2లక్షల 10 వేలకు గ్రామ యువకుడు పరమేష్ గౌడ్ లడ్డూ కైవసం చేసుకున్నాడు. ఈగల్స్ యూత్ లడ్డూ వేలం పాటలో రూ. 1లక్ష 116కు కాంట్రాక్టర్ రాంచందర్ లడ్డూ దక్కించుకున్నారు. అనంతరం ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!