ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ లోని నారాయణ పాఠశాలలో పీపీ-1, పీపీ-2 తరగతుల విద్యార్థులకు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (ఎస్ ఎల్ సి) కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల డీజీఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం పురుషోత్తం రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ఎన్. తులసి, వైస్ ప్రిన్సిపల్ అరుణా హాజరయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు తమ విద్యా ప్రగతిని, తాము నేర్చుకున్న అంశాలను వివిధ ప్రాజెక్టులు, కార్యకలాపాల ద్వారా తల్లిదండ్రులకు స్వయంగా వివరించి ఆకట్టుకున్నారు. తమ వర్క్ షీట్లు, సృజనాత్మక పనులు, సాధించిన పురోగతిని ప్రదర్శించారు. తమ బలాలు, మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు, భవిష్యత్తు లక్ష్యాలను తల్లిదండ్రులతో పంచుకున్నారు. విద్యార్థుల ప్రదర్శనలను తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించి అభినందించారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన సూచనలు, ప్రోత్సాహాన్ని అందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, మాట్లాడే నైపుణ్యం పెరుగుతుందని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య మంచి సమన్వయం ఏర్పడుతుందని నిర్వాహకులు తెలిపారు.
మేడ్చల్ నారాయణ స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్
RELATED ARTICLES
