Friday, October 2, 2026
Homeమేడ్చల్ జిల్లాపేట్‌బషీరాబాద్ నూతన ఇన్‌స్పెక్టర్‌గా శ్రీధర్‌రెడ్డి బాధ్యతల...

పేట్‌బషీరాబాద్ నూతన ఇన్‌స్పెక్టర్‌గా శ్రీధర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్‌స్పెక్టర్‌గా శ్రీధర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన విజయవర్ధన్ ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో శ్రీధర్ రెడ్డిని నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సహకారంతో పోలీస్ శాఖపై విశ్వాసం పెంపొందించేలా పని చేస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!