Saturday, October 3, 2026
Homeమేడ్చల్ జిల్లారూఫ్‌టాప్‌ సోలార్‌పై అవగాహన కార్యక్రమాలు

రూఫ్‌టాప్‌ సోలార్‌పై అవగాహన కార్యక్రమాలు

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : ఇళ్లపై రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుతో సౌర విద్యుత్‌ను వినియోగించుకోవడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేసేందుకు విద్యుత్‌ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. ప్రధానమంత్రి సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ యోజన (సేవా సేతు అభియాన్‌)లో భాగంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. అక్టోబరు 2 నుంచి 4వ తేదీ వరకు మేడ్చల్‌ డీఈ కార్యాలయం, వినియోగదారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విద్యుత్‌ శాఖ మేడ్చల్‌ డీఈ జాన్‌ పోతురాజు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటు విధానం, సౌర విద్యుత్‌ వినియోగం, కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ, పథకానికి అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ తదితర అంశాలపై ప్రజలకు వివరించనున్నారు. గృహ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సౌర విద్యుత్‌ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని విద్యుత్‌ శాఖ అధికారులు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!