Monday, October 5, 2026
Homeమేడ్చల్ జిల్లారెడ్ క్రాస్ సొసైటీ..! జిల్లా నిర్వహణ...

రెడ్ క్రాస్ సొసైటీ..! జిల్లా నిర్వహణ కమిటీ ఎన్నికలు

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్: రెడ్ క్రాస్ సొసైటీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నిర్వహణ కమిటీ బాధ్యుల ఎన్నికకు ఆదివారం బోయిన్పల్లి లోని ఎంఎంఆర్ గార్డెన్స్ లో ఎన్నికలు నిర్వహించారు. జిల్లాకు సంబంధించి రెడ్ క్రాస్ సొసైటీలో మొత్తం 4298 మంది సభ్యులుగా ఉండగా 1309 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 1263 ఓట్లు చెల్లుబాటు కాగా, 46 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికైన అభ్యర్థులను ప్రకటించారు. చంద్రశేఖర్ రెడ్డి, లోక రమాదేవి, మల్లేష్ యాదవ్, లింగారెడ్డి, ఎస్ఎం రాజేశ్వరరావు, బాల రాములు, దయాకం రాజు, మియాపురం రమేష్, పసుపులేటి శ్రీనివాస్ నాయుడు, ఎస్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ కే సంపత్ కుమార్, సి ఎస్ రామకృష్ణ, శ్రేయాస్, మహమ్మద్ అబ్దుల్ రజాక్, రమేష్ కుమార్, అజీముద్దీ ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!