Monday, October 5, 2026
Homeమేడ్చల్ జిల్లాఆర్టీసీ ఎన్నికల్లో తటస్థంగా ఎస్సీ, ఎస్టీ...

ఆర్టీసీ ఎన్నికల్లో తటస్థంగా ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్: తెలంగాణ ఆర్టీసీలో ఈ నెల 9న జరగనున్న కార్మిక సంఘాల ఎన్నికల్లో టీజీఎస్‌ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తటస్థంగా ఉండాలని నిర్ణయించినట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ తెలిపారు.సంఘం ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. సభ్యులు తమ స్థానిక పరిస్థితులు, వ్యక్తిగత అభిప్రాయాల మేరకు వివిధ యూనియన్లలో, పలు పదవుల్లో కొనసాగుతున్నారని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న యూనియన్లు పొత్తులు, ఇతర సమీకరణాలతో విజయం కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర, జోనల్, రీజియన్ కమిటీల నాయకులతో విస్తృతంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు వివిధ కమిటీల్లో అవకాశం కల్పించడంతో పాటు కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ, విలీనం తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సభ్యులు తమ ఆలోచన, ఆత్మప్రబోధం మేరకు వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర కమిటీ ఏ ఒక్క కార్మిక సంఘానికీ మద్దతు ఇవ్వడం లేదని, సంఘం ఐక్యతను కాపాడుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని కె.కృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర, జోనల్, రీజియన్, డిపో స్థాయి కమిటీలు, సభ్యులు ఈ నిర్ణయాన్ని పాటించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!