Tuesday, October 6, 2026
Homeమేడ్చల్ జిల్లానల్సార్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో సీఎంఆర్ నర్సింగ్...

నల్సార్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో సీఎంఆర్ నర్సింగ్ కళాశాల విజేత

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో సీఎంఆర్ నర్సింగ్ కళాశాల జట్టు ప్రథమ స్థానం సాధించి విజేతగా నిలిచింది. ఈ ఘన విజయం సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ గోపాల్ రెడ్డి, సీఈఓ అభినవ్ రెడ్డి, వైద్య కళాశాల డీన్ వెంకటరమణయ్య, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలేఖ, డైరెక్టర్ ఏ. రాజిరెడ్డి, ఆసుపత్రి సీఈఓ డాక్టర్ రాజ్‌కుమార్, మేనేజర్ జే. దుర్గాప్రసాద్ రెడ్డి, విద్యార్థి వ్యవహారాల డీన్ మానయ్య, ఫిజికల్ డైరెక్టర్ శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించడం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!